తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని NTR ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు కోసం పార్టీ మారిన వారు చనిపోయిన వారితో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘తెలుగు దేశం పార్టీ ఎంతోమంది యువకులకు రాజకీయాల్లో అవకాశం కల్పించింది. నా సోదరుడు ఎర్రంనాయుడు, నేను, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో రాణించగలుగుతున్నామంటే దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రోత్సాహం. రాబోయే రోజుల్లో కూడా పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు యువతకు అవకాశాలు ఇస్తే.. రాబోయే రోజుల్లో పరిణితి ఉన్న నేతలుగా మారతారు’’ అన్నారు.
ఇది కూడా చదవండి: అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!అంతేకాక ‘‘అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. తర్వాత అధికారం లేదని పార్టీ మారినవారు బతికున్నా చనిపోయినట్లే. బలహీన వర్గాలకు టీడీపీ ప్రాతినిధ్యం కల్పించింది కాబట్టే ఎన్ని కుట్రలు చేసినా పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది. పార్టీని లేకుండా చేయాలని ఎంతో ప్రయత్నం జరిగింది. కానీ ఏం చేయలేకపోయారు. జగన్ సర్కార్ టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టింది. కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగారు.. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అంటూ అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: టీడీపీలో మారిన అచ్చెన్నాయుడు తీరు! చంద్రబాబు దగ్గరికి రిపోర్ట్!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. రాబోయే రెండేళ్లు అందరికీ చాలా కీలకమన్నారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడితే అధికారం ఖాయమన్నారు.ఘ ఇక అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: నారా చంద్రబాబు రుణం తీర్చుకోలేనిది: రాఘవేంద్రరావు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.