కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలిది. పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చారు. గులాంనబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ తీరుపైన ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ తీరును దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనం అయ్యిందంటూ బహిరంగ విమర్శలు చేశారు. సీనియర్లందర్నీ రాహుల్ గాంధీ పక్కు పెట్టారని.. పార్టీలో సంప్రదింపులకు అవకాశం లేకుండా పోయిందని ఆరోపణలు చేశారు. ఈ రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు. గులాంనబీ ఆజాద్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.