2024 ఏపీ ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పనిచేయాలంటూ సీఎం జగన్ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి తమ నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను, ప్రభుత్వంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో.. ప్రజలను పలకరించేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రిని చూసిన శెట్టిపల్లి, శెట్టిపల్లి తండా వాసులు ఒక్కసారిగా గుమిగూడారు అంతా తమ సమస్యలను ఏకరవు పెట్టుకున్నారు. ఒకరు 11 నెలలుగా నాకు పింఛను రాలేదంటే.. మరొకరు నాకు ఇల్లు మంజూరు చేయించండి అంటూ వాపోయింది.
గుంపులో కొందరు మహిళలు తమకు పింఛన్ మంజూరు అయ్యేలా చూడాలంటూ కోరుకున్నారు. శంకరనారాయణ వెళ్లిన ఓ ఇంట్లో ఎవరో వ్యక్తి చనిపోయిఉండటంతో కార్యక్రమం చూసుకోండి.. మళ్లీ వస్తానంటూ ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అయితే ప్రజలు విన్నపాలు, విజ్ఞప్తులు చేస్తుంటే ఎమ్మెల్యే శంకరనారాయణ పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ అక్కడి జనం విమర్శించారు. గుంపులో ఓ మహిళ ఎమ్మెల్యేపై ఏకంగా బూతులతో విరుచుకుపడింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
YSRCP: శ్రీ సత్యసాయి జిల్లా.. గడపగడపకు కార్యక్రమంలో మాజీ మంత్రిపై విరుచుకుపడిన మహిళ
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో శనివారం ఉదయం మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం.. pic.twitter.com/HQDvx8FY8Y
— Eenadu (@eenadulivenews) July 16, 2022