టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత స్వరం పెంచారు ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి. పార్టీలో చంద్రబాబు, లోకేష్ బాబులు మంచి వాళ్లే అయినా ఆయన చుట్టూ ఉన్న పెద్దలు.. పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని వాళ్ల బండారాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది దివ్యవాణి. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, అచ్చెన్నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది దివ్యవాణి. పార్టీలో ఉన్నప్పుడు తనని వేధించారని.. బయటకు వచ్చిన తరవాత కూడా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నీతి నియమాలతో పనిచేసేవాళ్లు నిప్పుతో సమానం అని అలాంటి తనపై ట్రోలింగ్ ఇప్పటికైనా ఆపాలని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్ని కోరింది దివ్యవాణి.
తాజా వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలుగుదేశం పార్టీలో నేనెంతో సీరియస్‌గా పనిచేశాను. ఉన్న కొద్దిరోజుల్లో ఎంత కనెక్టివ్‌గా పనిచేశానో ప్రతి కార్యకర్తకి.. ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలుసు. ఒక ఆడకూతురు.. కన్నీటితో పార్టీ నుంచి బయటకు వచ్చిందంటే.. ఒక్కరు కూడా నన్ను పరామర్శించకపోగా.. టీడీ జనార్థన్ గారు నేను ఒక ప్యాకేజ్ ఆర్టిస్ట్‌ని అని.. జగన్ కోవర్ట్‌ని అని.. నాపై నిందలు వేస్తున్నారు. గత మూడున్నరేళ్లు నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో మీ మనసాక్షిని అడగండి.. చంద్రబాబుగారిని ఎవరైనా ఒక్కమాట అంటే.. అది మమ్మల్ని అన్నట్టుగానే భావించేవాళ్లం. అలాంటి నాపై నిందలు వేస్తున్నారు’’ ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Video: చీర కట్టులో బ్యాక్ ఫ్లిప్! కానీ.. చివరిలో ట్విస్ట్!
‘‘నేనే కాదు.. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. గత 30 ఏళ్లుగా ఎలాంటి పదవిని ఆశించకుండా.. బోలెడు డబ్బు ఖర్చుపెడుతున్న రాణి గారిని కూడా తప్పుపడుతున్నారు. ఆమె మనసాక్షి కలిగిన మనిషి కాబట్టి ఆమె నాతో మాట్లాడింది. నన్ను పరామర్శించడానికి వచ్చింది.. ఆమెపై కూడా నిందలు వేస్తున్నారు. ఈరోజు రాణిగారిని ప్రశ్నిస్తున్న వాళ్ళని నేను అడుగుతున్నా.. ఏవండీ అచ్చెంనాయుడు గారూ.. ఏదో బర్త్ డే పార్టీలో అనుకుంటా.. ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అని.. రాణి గారిని ట్రోలింగ్ చేశారు.. ఆమె ఆడకూతురు కాదా.. ఆమెకు ఫ్యామిలీ లేదా.. బిడ్డలు లేరా.. ఒక్కరైనా దానిపై స్పందించారా..’’ అని ప్రశ్నించారు. అలానే తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ని ఆపాలని సూచించారు. మరి దివ్యవాణి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Young man: ఆ యువకుడు షర్ట్ విప్పితే ఖంగుతిన్న పోలీసులు! ఎందుకంటే..