Comedian Prudhvi Raj Sensational Comments Joining In YSRCP: సీనియర్ నటుడు, కమెడియన్ థర్టీ ఇయర్స్ పృధ్వీ గురించి ప్రత్యేక పరిచయం లేదు. సినిమాల్లోనే కాక.. రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇతర పార్టీల నేతలపై అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పైనా ఆయన విమర్శలు చేశారు. అప్పట్లో ఫృధ్వీ వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీ కోసం తన వంతుగా కృషి చేశారు. ఏపీలో వైసీపీ ప్రజల ఆదరణ దక్కించుకుంది తిరుగులేని ఆధిపత్యాన్ని దక్కించుకుంది. ఇక కొన్ని రోజుల వరకు కూడా సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత పృధ్వీకి ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవి దక్కింది.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆ చానల్‌లో అవకాశం రావడానికి గొప్పగా భావించిన పృధ్వీ చురుగ్గా పని చేశారు. అయితే ఆయన ఓ మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఆడియోలు బయటకు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి రాజీనామా చేయించారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆయనను పట్టించుకోలేదు. అప్పటి వరకూ తన ప్రాణం పోయే వరకూ జగన్‌తోనే ఉంటానని చెప్పిన ఆయన ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. పలుమార్లు సీఎం జగన్‌తో పాటు సజ్జల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు పృధ్వీ.
ఇది కూడా చదవండి: విషాదం.. ఒకే రోజు పుట్టి.. ఒకే రోజు చనిపోయిన అన్నదమ్ములు!
మళ్లీ జగన్ పిలిచి వైసీపీలోకి రమ్మంటే వెళతారా! అని అడిగిన ప్రశ్నకు పృధ్వీ మాట్లాడుతూ ‘‘చాలండి.. నమస్కారమండి అని అంటాను. వెళ్లే వాళ్లకైనా సిగ్గు.. శరం ఉండాలి. నేను ఎప్పుడూ నా కులం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ చెబుతున్నాను. తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగిలో పుట్టిన కాపు బిడ్డగా చెబుతున్నాను. అలాంటి పనులు మా జాతిలో ఎవడూ చేయడు’’ అంటూ మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదనేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే ఏపీ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీలో పని చేయడానికి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: నిజమైన హనుమాన్ భక్తుడు ఈ పూజారి.. మహిళలు తాకితే స్పృహ తప్పి పడిపోతున్నాడు!
అయితే ఆయనను జనసేనపార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తే అంతా రాజకీయం అనుకునేవారు కానీ పృధ్వీ వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో పృధ్వీని జనసేన దగ్గరకు తీస్తుందో లేదో స్పష్టత లేదు. కానీ ఆయన మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో విషాదం.. వరుడు ఫైరింగ్.. స్నేహితుడు దుర్మరణం..! వీడియో వైరల్