చిత్తూరు జిల్లా, కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉన్నారు. అయితే రెండో రోజు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. నేడు చంద్రబాబు పర్యటనలో భాగంగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఈ లోపలే వైసీపీ, టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి పరస్పరం ధర్నాలకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో పలు చోట్ల వైసీపీ ఫ్లెక్సీలు తొలగించారు. మరోవైపు.. ఈరోజు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ కూడా ధ్వంసం అయ్యింది.
ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు. ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ కూడా తమ ఇళ్ల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక ఇరు పక్షాల నేతలను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరు ఎస్పీ కూడా కుప్పం చేరుకున్నారు. ఇక.. అన్నా క్యాంటీన్ ధ్వంసం అయిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి.. కుప్పం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.