ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు.. థియేటర్లలో చూసేవారు కొందరైతే, మరికొందరు మాత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత బయటకు చెప్పుకోవట్లేదు గానీ దాదాపు ఇలానే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చిరు, బాలయ్య సినిమాలతో సంతోష్ శోభన్ నటించిన మూవీ ఉంది. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. అందులో అందరినీ ఎట్రాక్ట్ చేసింది విజయ్ ‘వారసుడు’ చిత్రం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రిలీజ్ విషయంలో ముందు నుంచి వివాదాల్లో చిక్కుకుని ఈసారి హాట్ టాపిక్ అయిన చిత్రం ‘వారసుడు’. నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమాని కచ్చితంగా జనవరి 11నే విడుదల చేసి తీరుతానని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తమిళంలో యధావిధిగా రిలీజ్ చేశారు కానీ తెలుగు రాష్ట్రాలోని థియేటర్లలోకి మాత్రం జనవరి 14న తీసుకొచ్చారు. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విజయ్ ఫ్యాన్స్ తోపాటు మిగిలిన వారిని ఆకట్టుకుంటోంది. ఇదే టైంలో ఓటీటీ పార్ట్ నర్ ఎవరనేది కూడా తెలిసిపోయింది.
ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో పడినదానిబట్టి.. అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘వారిసు-వారసుడు’ హక్కుల్ని భారీ ధరకు దక్కించుకుంది. ఇక 4-6 వారాల తర్వాత అంటే.. ఫిబ్రవరి చివరి వారంలో ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం కాస్త దూకుడు చూపిస్తోంది. మూడు రోజుల్లో రూ.50 కోట్ల మార్క్ దాటేసినట్లు సమాచారం. తమిళంలో విజయ్-అజిత్ మధ్య పోటీ బాగానే ఉంది. మరి లాంగ్ రన్ లో విజయ్ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుందనేది చూడాలి. మరి ‘వారసుడు’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.