ఒకప్పుడు అంటే వీకెండ్ ఎప్పుడొస్తుందా? థియేటర్ కు ఎప్పుడు వెళ్దామా అని ప్రేక్షకులు ఎదురుచూసేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. థియేటర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓటీటీల్లోనూ పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. మనల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తెలుగు మాత్రమే చూసే ఆడియెన్స్ పలు మూవీస్ ఉండగా.. ఇక ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీసులు కూడా అదే టైంలో రిలీజ్ అవుతున్నాయి. అలానే రేపు ఒక్కరోజే ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా అంటే తెలుగు వాళ్లకు ప్రాణం. ఫుడ్, బెడ్ ఎంత ముఖ్యమో మనకు సినిమా కూడా అంతే. ప్రతివారం కూడా కొత్త సినిమాలు ఏవి వస్తున్నావా? వాటిలో వేటిని చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇక కరోనా మన జీవితాల్లోకి ఎంటరైన తర్వాత ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. దీంతో అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ప్రతివారం న్యూ మూవీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం దాదాపు 26 సినిమాల్ని రిలీజ్ చేయనున్నాయి. ఇందులో సమంత ‘యశోద’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ తదితర సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక పూర్తి జాబితా ఏంటి.. ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
Here’s the list of the 9th OTT Release Movies and Web series! pic.twitter.com/91L4t5Zby8
— SumanTV (@SumanTvOfficial) December 8, 2022