ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజ్ అనేది ఎవరూ ఎక్సపెక్ట్ చేయని విధంగా జరిగిపోతున్నాయి. ఏడాది పాటు షూటింగ్ చేసిన సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి నెలలపాటు వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు నెల రోజుల గ్యాప్ కూడా ఉండటం లేదు. ఇదివరకు థియేటర్స్ లో రిలీజైన సినిమాలు టీవీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని కొన్ని నెలలు వెయిట్ చేసేవారు సినీ ప్రేక్షకులు. ఆ సినిమా హిట్టయినా, ఫెయిలైనా.. ఏదైనా పండగ సమయం వస్తేగాని సినిమాలు టీవీ ఛానల్స్ లోకి వచ్చేవి కాదు. కానీ.. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక టీవీలలో ప్రీమియర్స్ అనేవి ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే.. థియేటర్స్ లో చూసినా చూడకపోయినా సినిమాలు కొన్ని రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా ఓటిటిలు సబ్ స్క్రిప్షన్ చేయించుకొని.. సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ద్విభాషా చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ త్వరలోనే ఓటిటి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ హీరో శర్వానంద్, అమల అక్కినేని, రీతూ వర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ టైం ట్రావెల్ మూవీ.. తల్లి కొడుకు మధ్య ఉండే అనుబంధాన్ని ఎంతో ఎమోషనల్ గా ఆవిష్కరించింది. అలాగే చాలా కాలంగా హిట్ కోసం ట్రై చేస్తున్న శర్వాకి మంచి విజయాన్ని అందించింది.
ఇక డెబ్యూ డైరెక్టర్ శ్రీ కార్తీక్ రూపొందించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఇక విడుదలైన 9 రోజుల్లోనే ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి లాభాల బాటపట్టింది. అయితే.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ‘సోనీలివ్’ సంస్థ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. కానీ.. ఈ సినిమా థియేట్రికల్ రిలీజైన 6 వారాలకు ఓటిటి రిలీజ్ కానుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అక్టోబర్ సెకండాఫ్ లో ఒకే ఒక జీవితం మూవీ(తెలుగు, తమిళ) సోనీలివ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది. మరి ఒకే ఒక జీవితం మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#OkeOkaJeevitham OTT RELEASE ON OCTOBER 20 @SonyLIV pic.twitter.com/BpbXzo4FPx
— OTTGURU (@OTTGURU1) September 18, 2022