స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ 5 తెలుగు.. ఈ భారీ రియాల్టీ షో ముగిశాక కూడా ఇంకా లైవ్ లో ఉన్నట్లే అనిపిస్తోంది. బిగ్ బాస్ షోలోని కొందరు పార్టిసిపెంట్స్ వ్యవహారమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. అందులోను సిరి హన్మంత్, షణ్ముఖ్, దీప్తీ సునయన పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలి. బిగ్ హౌజ్ లో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు బయటకు వచ్చాక కూడా వీరి లవ్ ఎపిసోడ్ ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
బిగ్‌బాస్ సీజన్ 5లో సిరి, షణ్ముఖ్‌లు నెగిటివిటీ క్రమంలోనే పాపులారిటీ సంపాదించారు. ఐతే ఈ పాపులారిటీ కాస్త వికటించడంతో, తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో విడిపోయింది. ఇక కలిసుండలేనంటూ తెగదెంపులు చేసుకుంది. ఇలా బ్రెకప్ కావడంతో ఓ వైపు షణ్ముఖ్, మరోవైపు దీప్తీ కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇదిగో ఈ క్రమంలోనే త్వరలోనే సిరికి కూడా శ్రీహాన్ బ్రేకప్ చెప్పేస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో సిరి, శ్రీహాన్ సోషల్ మీడియా అకౌంట్ల పై అందరు దృష్టి పెట్టారు. ఇటువంటి సమయంలో సోమవారం సిరి పుట్టిన రోజు సందర్భంగా శ్రీహాన్ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా.. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్.. గాడ్ బ్లస్ యూ.. అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టాడు శ్రీహాన్.
బిగ్ బాస్ హౌజ్ లో సిరిని ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఆమె గెలుపు కోసం చివరి వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీహాన్, బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత మాత్రం సిరితో కలిసి ఎక్కడా కనపడలేదు. దీంతో దీప్తి, షణ్ముక్‌ల తరహాలోనే.. సిరి, శ్రీహాన్ కూడా విడిపోతారనే ఊహాగానాల నెలకొన్నాయి. కానీ ఇలా సిరి బర్త్ డే రోజు శ్రీహాన్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే మాత్రం అలాంటిదేం లేదని అనిపిస్తున్నా.. ఎక్కడో అనుమానం వస్తోందని మాత్రం అంటున్నారు కొందరు.