గత 19 ఏళ్లుగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని కళాకారులకు అవార్డులు అందిస్తున్న.. సంతోషం అవార్డ్స్ కార్యక్రమం ఎంతటి ప్రత్యేకతని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఇక.. ఇప్పుడు డిజిటిల్ మీడియా జైన్ట్ సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా మొదటిసారి సంతోషంతో కలసి ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భాగం అయ్యింది. హెచ్ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ ఆదివారం సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్-2021 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ అవార్డు ఫంక్షన్ కి రియల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి అతిధిగా విచ్చేశారు. అవార్డ్స్ విన్నర్స్ కి తన చేతుల మీదగా అవార్డ్స్ అందించిన ఆర్. నారాయణమూర్తి ఈ వేదికపై తనదైన స్టయిల్ లో ప్రసంగించారు.
“ఈరోజు మన తెలుగు సినిమా యావత్ సినీ జగత్తులో సగర్వంగా సత్తా చాటుతుంది. ఇందుకు పాన్ ఇండియా సినిమాలే కారణం. ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకులు, బాహుబలి వంటి సినిమాలు దీనికి ప్రధాన కారణం. గతంలో బాలీవుడ్ కూడా సక్సెస్ కావాలని మన స్టార్ హీరోలు చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ.., కుదరలేదు. అయితే.. ఇప్పుడు మన రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇలా తెలుగు సినిమా కీర్తి రోజురోజుకి ఎదగడం ఆనందదాయకమే. కానీ.., పాన్ ఇండియా పేరు తెలుగు ఆర్టిస్ట్ ల పొట్ట కొట్టొద్దు. తెలుగు వారికి కూడా అవకాశాలు వచ్చేలా చూడాలి” అని ఆర్.నారాయణ మూర్తి దర్శకనిర్మాతలను వేడుకున్నాడు.
ఇక ఇదే సమయంలో నంది అవార్డ్స్ విషయంలో కూడా ఆర్. నారాయణమూర్తి ఓపెన్ కామెంట్స్ చేశారు. “నంది అవార్డ్స్ ఇవ్వడం ప్రభుత్వాలు మానేశాయి. ఓ కళాకారుడికి ప్రభుత్వం నుండి లభించే అవార్డు గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. కానీ.., మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు? నంది అవార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎంత ఖర్చు అవుతుంది? కళాకారులను ఆ మాత్రం గౌరవించలేరా? అయ్యా.. పాలకుల్లారా దయ చేసి ఇకనైనా నంది అవార్డ్స్ ఇవ్వండి” అని ఆర్. నారాయణమూర్తి ప్రసంగించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.