పోలీస్..ఇదే పదం దేశ ప్రజలకు రక్షణతో పాటు భరోసాను కూడా ఇస్తోంది. కానీ కొందరు పోలీసు అధికారులు మాత్రం వక్ర మార్గంలో కి వేలుతు పోలీస్ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని తుడిపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కొల్లాం జిల్లా పరిధిలోని కొట్టారక్కర పోలీస్ స్టేషన్ లో బిజు జాన్ అనే పోలీస్ అధికారిగా తన విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇక స్టేషన్ కి వచ్చే మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వెకిలి చేష్టలకు కాలు దువ్వుతున్నాడు. ఇక కాలయపురానికి చెందిన ఓ మహిళ నాలుగు రోజుల క్రితం మద్యం తాగిన వ్యక్తులు ఇంటి వద్ద హల్చల్ చేస్తున్నారని కొట్టారక్కర పోలీసులకి తన ఫిర్యాదును అందజేసింది. దీంతో రంగంలోకి దిగిన కొట్టారక్కర పోలీసులు ఆ నిందితులను స్టేషన్ కి పిలిపించి మందలించి వారిని వదిలేశారు. ఇక అంతటితో శాంతించిన ఆ మహిళ పోలీసుల నిర్ణయానికి తలొగ్గిపోయింది.
ఇక దీంతో ఆ స్టేషన్ లోని బిజు జాన్ పోలీస్ అధికారి ఫిర్యాదు చేసిన మహిళపై కాస్త కన్నేశాడు. ఎలాగైనా ఆమెకు ఫోన్ చేయాలనుకుని ఒక రోజు చేశాడు. ఇక ఆ మహిళతో ఫోన్ లో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతు కాస్త ఇబ్బందికి గురిచేశాడు. దీంతో ఒక రోజు అదే పోలీస్ అధికారి బిజు జాన్ మహిళకు ఫోన్ చేసి ముద్దు కావాలని కోరాడు. ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ మహిళ గంగతిని ఆమెకు చెమటలు పట్టేంత పనైంది. ఇక లాభం లేదనుకుని ఆ పోలీస్ అధికారి తీరును ఎండగట్టాలనుకుని భావించింది.
ఇదే విషయాన్ని సదరు పోలీస్ పై అధికారులకు చేరవేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిజు జాన్ పోలీస్ ఆఫిసర్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. కాగా సమాజానికి రక్షణగా నిలవాల్సిన ఇలాంటి పోలీసులే ఇలా ప్రవర్తించటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక బిజు జాన్ పోలీస్ అధికారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.