At 83: ప్రీస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తి జీవితపు చివరి దశలో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. 80 ఏళ్ల వయసులో నీలి చిత్రాల తారగా మారాడు. డబ్బులు తీసుకోకుండానే వీడియోలు చేస్తున్నాడు. శృంగారం ప్రజల్ని దేవుడికి దగ్గర చేస్తుందంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన నార్మ్ అనే వ్యక్తి ప్రీస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతడు గే అవటంతో భార్యతో సంసారజీవితాన్ని సరిగా గడపలేకపోయాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి అతడికి 30 ఏళ్లు పట్టింది. భార్య నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నాడు. 20 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలోనే అతడి మనసు శృంగారం పైకి మళ్లింది.
ఇక ఏమాత్రం ఆలోచించకుండా ప్రీస్ట్ బాధ్యతలకు స్వప్తి పలికాడు. 2017లో నీలి చిత్రాల తారగా మారాడు. ఇక అప్పటినుంచి డబ్బులు తీసుకోకుండా వీడియోలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 83 ఏళ్లు. నార్మ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలతో పాటు ప్రస్తుత అనుభవాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ శృంగారం ప్రజల్ని దేవుడికి దగ్గరవటానికి సహాయం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో అదొక సంతోషకరమైన భాగం. అది ఓ పార్టీలాగా ఉంటుంది.
అందుకే అదంటే నాకు చాలా ఇష్టం. నేను నీలి చిత్రాల తారగా ఉండటం అద్భుతంగా ఉంది. ఆ సమయంలో నా శరీరం ఓ గుడిలా అనిపిస్తుంది. ప్రజల్లో శృంగారంపై వ్యతిరేక భావాలు తొలిగే వరకు ఈ సినిమాల్లో నటిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. నార్మ్ చేసిన పనికి సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది దీన్ని సపోర్టు చేస్తుంటే.. మరికొంతమంది ‘ఈ వయసులో ఇలాంటి పనులేంటి?’ అంటూ మండిపడుతున్నారు. మరి, నార్మ్ చేస్తున్న పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Africa: ఈ గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష వేశారు.. ఎందుకంటే?