ఫిల్మ్ డెస్క్- మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్.. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా మా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జివితా రాజశేఖర్, హేమ వంచి వారంతా ఈ సారి మా అధ్యక్ష్య పదవికి పోటీ పడుతున్నారు. దీంతో మా ఎన్నికలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తున్నాయి. ఐతే మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మా సభ్యత్వం ఉండాలి. కానీ మా సభ్యత్వం దొరకాలంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. కేవలం ఆర్టిస్టు అయి ఉంటే మా సభ్యత్వం ఇవ్వరు. దానికి చాలా తంతంగం ఉంది.

మా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే మా సభ్యత్వం పొందడమే పెద్ద టాస్క్ అని అంటున్నారు చాలా మంది ఆర్టిస్టులు. మా..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డ్ కావాలంటే లక్షల్లో డబ్బులు కట్టాల్సిందే. ప్రస్తుతం మా సభ్యత్వం ఫీజు సుమారుగా 1లక్షా 50 వేల రూపాయలు ఉంది. అంతేకాదు సినిమాలో నటించాం కదా, నాకు మెంబర్ షిప్ కార్డ్ ఇచ్చేయండి డబ్బులు కట్టేస్తా అంటే అస్సలు కుదరదు. డబ్బులు కట్టినా మా సభ్యత్వానికి చాలా నిబంధనలు ఉన్నాయి. తెరపై కనిపిస్తే సరిపోదు, ఫుల్ లెంగ్త్ పాత్ర చేసి ఉండాలి. ఆ రోల్‌కి డైలాగ్‌లు తప్పనిసరిగా ఉండాలి. అంతే కాదు కనీసం మూడు సినిమాల్లో ఖచ్చితంగా నటించి ఉండాలి.
ఇక సినిమా టైటిల్ కార్డ్స్‌లో పేరు తప్పనిసరి. ఇలా మా సభ్యత్వానికి సవా లక్ష కండిషన్స్ ఉన్నాయి. చిన్నపాటి ఆర్టిస్ట్‌లు లక్షల్లో డబ్బులు కట్టి మా మెంబర్ షిప్ తీసుకోవడమే పెద్ద కష్టమే అని చెప్పవచ్చు. మూవీ ఆర్టిస్ట్స్ మెంబర్ షిప్ వ్యవహారంలో ఇంతకు ముందు కూడా చాలా వివాదాలు నడిచాయి. వివాదాస్పద నటి శ్రీరెడ్డి అయితే ఎంత హంగామా చేసిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ మా ఎన్నికల వేల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల యుధ్దం మొదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ కొత్త డిమాండ్‌ని తెరపైకి తీసుకుని వచ్చింది. మా మెంబర్ షిప్ కార్డ్‌కి మంత్లీ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
