సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. టాలీవుడ్ ప్రేక్షకులు అలనాటి అగ్రతారల్లో మరో తారను కోల్పోయారు. ధైర్యానికి నిలువెత్తు రూపం ఆయన. టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో, నిర్మాత ఎవరంటే తడుముకోకుండా కృష్ణపేరే చెబుతారు. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా కృష్ణ పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. మోహన్ బాబు, కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులు వెక్కి వెక్కి ఏడ్చేశారు. బడా స్టార్ల నుంచి చోటా మోటా హీరోల వరకు అంతా కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున మాత్రం అంత్యక్రియలకు హాజరు కాలేదు.
నానక్‌రామ్‌గూడ వద్ద ఇంటికి గానీ, పద్మాలయ స్టూడియోకి గానీ వచ్చి కింగ్ నాగార్జున నివాళులర్పించలేదు. నాగచైతన్య, అఖిల్ మహేశ్ బాబుని పరామర్శించడం చూశాం. అయితే నాగార్జున ఎందుకు రాలేదు అంటూ నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు వ్యక్తిగతంగా ఎలాంటి కారణాలు లేవంటున్నారు. నాగార్జున హైదరాబాద్‌లో లేకపోవడం వల్లే రాలేకపోయారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వేరేచోట ఉన్నా కూడా వేర్వేరు కారణాల వల్ల కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించలేదని చెబుతున్నారు. ట్విట్టర్ వేదికగా నాగార్జున స్పందించడం చూశాం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యాడు. మహేశ్‌బాబు తల్లి మరణించిన సమయంలో నాగార్జున హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు రాకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని క్లారిటీ ఇస్తున్నారు.
ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేశ్ బాబు బాధ వర్ణణాతీతం అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహేశ్‌బాబుకు ఇలాంటి కష్టం వచ్చి ఉండకూడదంటూ కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో కృష్ణకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడే ఆయన చేసిన 365 సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఆయనకు వచ్చిన అవార్డులు, కృష్ణ ఫొటోలను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే కృష్ణ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని ఒకేచోట చూసేందుకు అభిమానులకు అవకాశం దక్కుతుంది. ఈతరం వారికి కూడా కృష్ణ ఎంత గొప్ప నటుడో తెలుస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
A Fearless man who attempted every genre!! The original cowboy of Telugu films!! I could sit with him for hours which were filled with his positivity😊 the man the legend the superstar!!#RIPSuperStarKrishnaGaru we will miss you🙏🙏🙏 pic.twitter.com/ccJlBP1CZd
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 15, 2022