నందమూరి తారకరత్నకు నివాళి అర్పించిన తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్‌తో చాలా సేపు మాట్లాడారు.
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని సినీనటులు, ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రాజ్ సందర్శించి నివాళులర్పించారు. శనివారం రాత్రి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పిత్రిలో తారకరత్న చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఆయన పార్థీవదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అయితే.. వారి కంటే ముందే అక్కడికి వైఎస్సార్ సీపీ నేత ఎంపీ విజయసాయి రెడ్డి చేరుకున్నారు.
విజయసాయి రెడ్డి.. తారకరత్నకు మామయ్య అవుతారనే విషయం తెలిసిందే. దీంతో ఆయన తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించి అక్కడ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌తో విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఎన్టీఆర్, విజయసాయి రెడ్డి మధ్య కళ్యాణ్‌రామ్ కూర్చోగా.. ముందు కళ్యాణ్‌రామ్‌తో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. తర్వాత కళ్యాణ్‌రామ్ ప్లేస్‌లో ఆయన కూర్చోని, జూనియర్ ఎన్టీఆర్‌తో చాలా సేపు మాట్లాడారు. సోదరుడు తారకరత్న మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న ఎన్టీఆర్‌ను విజయసాయి రెడ్డి ఓదారుస్తున్నట్లు కనిపించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.