Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాలు, సాంగ్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అలాగే మైక్ టైసన్ సైతం లైగర్ లో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం.
ఇక ఈ సినిమా నుండి తాజాగా విజయ్ న్యూ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో విజయ్ కండలు తిరిగిన బాక్సర్ బాడీతో నిలబడి ఉన్నాడు. కానీ.. ఒంటిపైన దుస్తులేవీ లేకపోవడం గమనార్హం. కేవలం విజయ్ చేతిలో ఫ్లవర్స్ మాత్రమే ఉండటం మనం పోస్టర్ లో గమనించవచ్చు. ఇక ఈ కొత్త పోస్టర్ పీకే మూవీలో అమీర్ ఖాన్ ని పోలి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం సాలా క్రాస్ బ్రీడ్ అంటూ రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఈ సినిమాకోసం మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడ్డానని తాను పడిన కష్టాన్ని చెప్పుకొచ్చాడు విజయ్. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. మరి లైగర్ లేటెస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022