సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకు వరుసగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్లాప్ సినిమాలు పడితే.. కంబ్యాక్ ఎప్పుడని అందరూ అడుగుతుంటారు. ఇంకెప్పుడు కంబ్యాక్ ఇస్తాడో లేక హిట్ కొడితే బాగుండు అని ఫ్యాన్స్ అంతా అనుకుంటారు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయంలో ఫ్యాన్స్ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. అలాగే విజయ్ ఎక్కడ కనిపించినా కంబ్యాక్ ఎప్పుడని అడుగుతున్నారట. ఆ వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ హీరోగా చాలా తక్కువ టైంలో స్టార్డమ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ఒక్కసారిగా ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు.
ఈ రెండు సినిమాలతో యూత్ కి దగ్గరైన విజయ్.. గీతగోవిందం మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. అలా వరుస హిట్స్ లో ఉన్న విజయ్.. అక్కడినుండి వరుసగా ప్లాప్స్ బారిన పడుతూ వస్తున్నాడు. గీతగోవిందం తర్వాత విజయ్ నుండి వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ప్లాప్స్ కారణంగా విజయ్ క్రేజ్ అయితే తగ్గలేదు గానీ.. ఓ హిట్ పడితే బాగుంటుందనే అభిప్రాయాలు మాత్రం వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన సెల్ఫ్ మేడ్ హీరోలలో విజయ్ ఒకరు.
ఇదిలా ఉండగా.. ఎన్ని ప్లాప్స్ పడినా ఎప్పుడూ పెద్దగా విమర్శలకు గురవ్వని విజయ్.. లైగర్ ప్లాప్ తో ఒక్కసారిగా భారీ ట్రోలింగ్ ఫేస్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో విజయ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని లైగర్ మూవీని తీశాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆర్థికంగా కూడా నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో లైగర్ ప్లాప్ వల్ల విజయ్ ఎక్కడికి వెళ్లినా.. కంబ్యాక్ ఎప్పుడని అడుగుతున్నారట. దీంతో ఈ విషయంపై ఇటీవల స్పందించిన విజయ్.. “అందరూ కంబ్యాక్ ఇవ్వాలి అంటున్నారు. నేను ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నా” అని చెప్పినట్లు సమాచారం. సో.. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తున్నాడు. చూడాలి మరి ఆ సినిమా విజయ్ ని హిట్ ట్రాక్ లో చేర్చుతుందేమో!
Vijay Devarakonda on Post Liger Situations. pic.twitter.com/VBx3HYRvWJ
— Fukkard (@Fukkard) November 8, 2022