ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో విషమించి మంగళవారం కన్నుమూశారు.సిరివెన్నెల మృతి పట్ల ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుుడ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
‘తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా ‘సిరివెన్నెల’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ ఆయన రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకడిని అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్ లో మాట్లలాడానని, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను అని వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం అని అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుశారు. . సిరివెన్నెల మృతి చెందడంతో పలువురు ప్రముఖులు నివాళులర్పించడంతో పాటు సంతాపం తెలుపుతున్నారు.
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. pic.twitter.com/K2fL2IZrFy
— Vice President of India (@VPSecretariat) November 30, 2021