దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘వారిసు’. సంక్రాంతి కానుకగా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మన దగ్గర విడుదల తేదీ మారింది. ఇక జనవరి 11న తమిళనాడులో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ నార్మల్ ఆడియెన్స్ మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు. ఇలా టాక్ ఏదైనప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం విజయ్ తగ్గేదే లే అని ప్రూవ్ చేశాడు. దీంతో తొలిరోజు వరల్డ్ వైడ్ అద్భుతమైన వసూళ్లని సాధించింది.
ఇక విషయానికొస్తే.. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా నటులు, దర్శకులు కలిసి పనిచేస్తున్నారు. అలా తమిళ స్టార్ హీరో విజయ్ తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసిన మూవీ ‘వారిసు’. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, తమన్ సంగీతమందించాడు. రష్మిక హీరోయిన్ గా చేసింది. ఇక ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిసిపోయింది. దానికితోడు సినిమాపై తెలుగు ప్రేక్షకులు ట్రోల్స్ కూడా చేశారు. ఇలా రిలీజ్ కు ముందే హాట్ టాపిక్ గా మారిన ‘వారిసు’ ఎలాగైతేనేం థియేటర్లలోకి వచ్చేసింది.
ఇక తొలిరోజు తమిళనాడుతో పాటు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓవరాల్ గా రూ.35 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఫస్ట్ డే తమిళనాడులో రూ.27 కోట్లు, కర్ణాటకలో రూ.5.60 కోట్లు, కేరళలో రూ.4.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఒకవేళ ఈ భాషల్లోనూ ఒకేరోజు రిలీజై ఉంటే మాత్రం ఫస్ట్ డే వసూళ్లు రూ.40 కోట్లు దాటేసేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇక అజిత్ తునివు(తెలుగులో ‘తెగింపు’) కూడా ఒకే రోజు రిలీజైంది కానీ ‘వారిసు’ కలెక్షన్స్ దాటలేదని తెలుస్తోంది. మరి విజయ్ సినిమా ఫస్ట్ డే వసూళ్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.