సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అది సినిమా విషయంలో అవ్వొచ్చు లేదా బయట సమాజం పట్ల కావచ్చు. కానీ.. సెలబ్రిటీలుగా ఉన్నవారు మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది.. కాబట్టి, కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవుతుంటాయి. అయితే.. తాజాగా యశోద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాంట్రవర్సీ అని కాదు గానీ, యశోద సినిమా సరోగసీ కాన్సెప్టు బేస్ చేసుకొని తెరకెక్కడంతో.. ఇప్పుడు వరలక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’. సరోగసీ కాన్సెప్టు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం సమంత హాస్పిటల్ లో ఉండటంతో ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది. అయితే.. యశోద మూవీతో పాటు తన కెరీర్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్న వరలక్ష్మి.. ఇల్లీగల్ ఎఫైర్స్, సరోగసిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సరోగసీ అనేది ఈ మధ్యకాలంలో మామూలే అయిపోయిందని, లీగల్ గా ప్రొసీడ్ అయితే తప్పులేదని చెప్పింది.
సరోగసి విషయంలో లీగల్ గా కాకుండా ఇల్లీగల్ ఇష్యూస్ జరుగుతుండటం మనం చూస్తుంటాం. వాటిపై మీరేమంటారు? అని యాంకర్ అడగ్గా.. “ఇల్లీగల్ విషయాల విషయాల గురించి నాకు తెలీదు. అన్నింట్లో ఇల్లీగల్ ఉంది. ఆల్కహాల్.. డ్రగ్స్.. సె*క్స్.. లో కూడా ఇల్లీగల్ ఉంది. మనం చేసే పనిలో ఇల్లీగల్ లేకుండా చూసుకోవడమే పాయింట్. లీగల్ గా సరోగసి మంచి విషయమే. మూడో వ్యక్తి ద్వారా పిల్లలను కనాలని అనుకోవడం అనేది వారి పర్సనల్ ఛాయస్. కాకపోతే దానికంటూ సపరేట్ రూల్స్ పాటిస్తే మంచిదని నా అభిప్రాయం” అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి. ప్రస్తుతం సరోగసిపై వరలక్ష్మి మాటలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.