మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. అందం, అభినయంతో ఆకట్టుకుంది. గ్లామర్ రోల్స్ కూడా సై అంది. ఇన్ని చేసినా ఈ అమ్మడి కెరీర్ మాత్రం ఆశించిన మేర సెక్సెస్ కాలేదు. తెలుగులో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సరసన నటించినా సరే.. అమ్మడి జాతకం మారలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తాజాగా ఊర్వశివో రాక్షసివో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అల్లు శిరీష్ ఈ సినిమాలో హీరో. నవంబర్ 4న సినిమా విడుదల కానుంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రిపోర్టర్లపై హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అసహనం వ్యక్తం చేసింది.
మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రం బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అను ఇమ్మాన్యుయేల్‌ని ఉద్దేశించి మీరు గతంలో బన్నీతో యాక్ట్ చేశారు.. ఇప్పుడు శిరీష్‌తో కూడా పని చేశారు. మరి వీరిద్దరిలో ఎవరు క్యూటెస్ట్.. ఎవరు నాటీ అని ప్రశ్నించారు. అందుకు అను ఇమ్మాన్యుయేల్.. నవ్వుతూనే.. మీ దగ్గర ఇంతకన్నా మంచి ప్రశ్నలేం లేవా.. అడగడానికి అంటూ సెటైర్లు వేసింది.
ఇక అను, శిరీష్ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా శిరీష్ ఈ వార్తలపై స్పందించాడు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. అవన్ని వట్టి పుకార్లే అని తెలిపాడు. అయితే అల్లు శిరీష్ లైఫ్‌లో రెండు మూడు బ్రేకప్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఓ పెద్దింటి అమ్మాయితో తనకు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు శిరీష్.