తెలుగు బుల్లితెరపై పెళ్లీడు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోని బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారంటే.. ఆ లిస్టులో మొదటగా వినిపించే పేర్లలో యాంకర్ రష్మీ గౌతమ్ పేరు కూడా ఉంటుంది. దాదాపు పదిహేనేళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రష్మీ.. ఇప్పటివరకు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. సక్సెస్ అయ్యింది. అలాగే తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. స్టేజిపై గ్లామర్ ఒలికిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రష్మీ.
ఇక బుల్లితెరపై స్టార్డమ్ ఉన్న రష్మీకి, సుడిగాలి సుధీర్ తో మంచి పెయిర్ కుదిరి.. ఇన్నేళ్ళపాటు ప్రేమలో ఉన్నామంటూ చెప్పి ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేశారు. అయితే.. రష్మీ, సుధీర్ కొంతకాలంగా ఎవరి షోస్ వారే చేస్తూ షోలలో పెద్దగా కలిసి కనిపించడం లేదు. మరోవైపు సుధీర్ టీవీ షోలతో పాటు వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అప్పటినుండి సుధీర్ యాంకరింగ్ చేసిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి కూడా రష్మీనే హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఫ్యాన్స్ రష్మీ పెళ్లి కబురు చెబితే వినాలని చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా తన పెళ్లి ఎప్పుడో చెప్పి సర్ప్రైజ్ చేసింది రష్మీ. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోకి హీరోయిన్స్ ఖుష్బూ, ఇంద్రజ జడ్జిలుగా కంటిన్యూ అవుతున్నారు. అయితే.. ఈ షోలో ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను చేసిన లేటెస్ట్ స్కిట్ లో రష్మీ తన పెళ్లి వార్తను బయటపెట్టింది. ‘రష్మీ త్వరగా పెళ్లి చేసుకో వయసు అయిపోతుంది కదా?’ అనగానే.. “అన్నట్టు వచ్చే నెల నా పెళ్లి. దసరా ఈవెంట్ ఉంది కదా.. అందులోనే. నా పెళ్లి ఈవెంట్స్ లోనే జరుగుతుంది.. బయటకాదు” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి రష్మీ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: