‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు నమోదు చేస్తోంది. రాజకీయ పార్టీలు వారి నాయకులు, ప్రజాప్రతినిధులకు సైతం ఈ సినిమా చూడాలని సూచిస్తోంది. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అస్సాం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సినిమా చూసేందుకు సెలవు కూడా ప్రకటించింది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాపై వినోదపు పన్ను మినహాయించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా దేశవ్యాప్తంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ..!
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్న మొదలైంది. ఈ రేంజ్ టాక్ వచ్చిన సినిమాని అంత ఈజీగా ఓటీటీలోకి తెస్తారా? మొదట ఈ సినిమాని విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ రిలీజ్ చేద్దామని భావించారు. అంటే మార్చి 11న విడుదలైంది కాబట్టి.. ఏప్రిల్ రెండో వారం ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సినిమాకి వచ్చిన ఈ స్పందన చూసి మేకర్స్ కూడా ఆశ్యర్యపోయారు. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అప్పుడే రిలీజ్ చేయడం కంటే.. కొన్నాళ్లు ఆగడమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని మే 6న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఓటీటీలో సాధ్యమైనంత వరకు రీజనల్ భాషల్లోనూ సినిమా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే జీ5లో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను తెలుగులో చూడచ్చు. ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.
#WATCH | At BJP Parliamentary Party meet, PM speaks on role of film industry in presenting history. He also mentions ‘The Kashmir Files’; says “People who always raise flag of freedom of expression are restless. Instead of reviewing on facts, campaign being run to discredit it..” pic.twitter.com/mq8iqA6Ajk
— ANI (@ANI) March 15, 2022
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 1980-90ల మధ్య కశ్మీర్ లో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఆ సమయంలో ఓ వర్గం ప్రజలపై జరిగిన మారణకాండను చూపించారు. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో పోషించారు. అప్పటి విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యారంటూ చాలా మంది ఈ చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Kashmir Files has made ₹60 crore in just five days with a budget of ₹20 crore, and it is yet to peak at the box office. Honesty, not duplicity, can reap huge profits too. This film is not a ‘Bollywood’ film. It’s anti-Bollywood in fact. Everything B’wood refused to give us.
— Shubhangi Sharma (@ItsShubhangi) March 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.