చిత్ర పరిశ్రమలో అవార్డులకు ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఈ అవార్డులు వారిని మరింత ఉత్సాహాపరుస్తూ ఉంటాయి. దాంతో వారు రెట్టించిన ఆనందంతో పనిచేసేందుకు ఇవి దొహద పడతాయి. తాజాగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిల్లో మన ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడ్నిసైతం అవార్డు వరించింది. ఈ అవార్డు గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
68వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. అందులో భాగంగానే ఉత్తమ సంగీత దర్శకుడిగా పాటల విభాగంలో ఎస్.ఎస్ తమన్ అవార్డు దక్కించుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికిగాను తమన్ ఈ అవార్డును అందుకున్నాడు. తెలుగు సిని పరిశ్రమలో తమన్ తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. వరుస భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమన్ గాడ్ ఫాదర్, RC15, SSMB28 చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి తమన్ జాతీయ అవార్డును అందుకోవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Congratulations #SSThaman For Bagging The National Award For The Best Music Director – Telugu | Alavaikunthapurramuloo @MusicThaman#NationalAwards #Alavaikunthapurramuloo #BestMusicDirector pic.twitter.com/FL16jbAChR
— Behindwoods (@behindwoods) July 22, 2022