Taraka Ratna Death News: 23 రోజులు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న శనివారం మహాశివరాత్రి రోజునే శివైక్యం చెందారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి మరణం రాదని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా మంది భక్తులు ఇదే నమ్ముతారు కూడా..
నందమూరి నట వారసుల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు తారకరత్న. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు తారకరత్న. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడు నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్ర తొలి రోజే గుండె పొటుకు గురైయ్యారు తారకరత్న. దాంతో ఆయన్ని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అప్పటి నుంచి 23 రోజుల పాటు ఆయన కోమాలోనే ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా శనివారం నాడు తారకరత్న ఆరోగ్యం క్షీణించడంతో మహాశివరాత్రి నాడే శివైక్యం చెందారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఆ పరమశివుడి రోజైన శివరాత్రి నాడే దివిలోకి వెలిశారు. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మెుత్తం దిగ్బ్రాంతికి లోనైంది. అయితే మృత్యువును తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. కానీ ఆ మృత్యువు ఎలా వచ్చింది.. ఏ రోజున వచ్చింది అన్నదే ఇక్క తెలుసుకోవాల్సిన విషయం. 23 రోజులు మృత్యువుతో పోరాటం చేసిన తారకరత్న మహాశివరాత్రి నాడే శివైక్యం చెందడం అన్నది ఎన్నో జన్మల పుణ్యంగా నమ్ముతారు చాలా మంది భక్తులు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది.. ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు తారకరత్న విషయంలోనూ అదే జరిగింది.
అయితే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఇలా శివరాత్రి నాడు శివైక్యం చెందడం సంభవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మహా శివరాత్రి నాడు మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరణం అన్నది ఏ మనిషి జీవితంలో అయినా, ఎప్పటికైనా రావాల్సిన ఘట్టమే అయినప్పటికీ అది ఏ పుణ్యకాలంలో వచ్చింది అన్నదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఇలా మహా శివరాత్రి రోజు మరణం రాదని వేదాల్లో, పురాణాల్లో వివరించబడింది. మరి శివరాత్రి నాడే నందమూరి తారకరత్న శివైక్యం చెందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.