సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలని చూస్తే ముచ్చటేస్తుంది. నాగార్జున-అమల, మహేష్ బాబు-నమ్రత, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ, కోలీవుడ్ లో సూర్య-జ్యోతిక.. ఇలా వీరి జంటలు చూడముచ్చటగా ఉంటాయి. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న సూర్య–జ్యోతిక జోడీ ఒకే వేదిక మీద, ఒకేలాంటి రియాక్షన్ ఇస్తూ కనబడిన క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు అందుకోవడానికి ఈ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ రావడం, ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగడం, సెపరేట్ గా సెల్ఫీ తీసుకోవడం, అవార్డులు తీసుకోవడం వంటి మూమెంట్స్ ని షేర్ చేస్తూ కపుల్ గోల్స్ అంటూ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకే రోజు, ఒకే వేదిక మీద ఈ ఇద్దరూ అవార్డులు అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్ గా ఉన్నారు.
Trust me, the best couple goals one can set in life ♥️ #Suriya #Jyothika pic.twitter.com/ra2QTf87b3
— A N B A A N A • F A N (@Monish_SuriyaFC) September 30, 2022
68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు, టెక్నీషియన్స్ కి జాతీయ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం రాత్రి జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది. ఈ వేడుకకు సూర్య, జ్యోతిక జంట కూడా వచ్చింది. 2020 ఏడాదికి సంబంధించి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ఈ ఏడాది జూలైలో కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2020లో తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాగా వచ్చిన తమిళ మాతృక సూరారై పోట్రు సినిమాలో సూర్య నటించగా.. ఆ సినిమాకి సహ నిర్మాతగా జ్యోతిక పని చేశారు.
#Suriya & #Jyothika with their kids at #NationalFilmAwards ❤️👏 pic.twitter.com/d5YYafsMJg
— AB George (@AbGeorge_) September 30, 2022
ఉత్తమ నటుడిగా సూర్య జాతీయ అవార్డు అందుకోగా.. ఉత్తమ చిత్రంగా సూరారై పోట్రు సినిమాకి సహ నిర్మాత అయిన జ్యోతిక జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఈ జంటకి సంబంధించిన మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మూమెంట్స్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒకే సినిమాకి పని చేసి.. ఒకే వేదిక మీద భార్యాభర్తలైన సూర్య-జ్యోతిక జాతీయ అవార్డు తీసుకోవడం వారికి, ఫ్యాన్స్ కి మరచిపోలేని రోజుగా గుర్తుండిపోతుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళీ, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, దర్శకురాలు సుధా కొంగర జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగులో అల వైకుంఠపురములో సినిమాకి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ జాతీయ అవార్డు అందుకోగా.. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో సినిమాకి గాను దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత సాయి రాజేష్ లకు జాతీయ అవార్డులు అందుకున్నారు.
Couple goals. ♥️#Suriya #Jyothika pic.twitter.com/kBYeioyQpF
— Prayag (@theprayagtiwari) September 30, 2022
The Lovely Couple #Suriya sir & #Jyothika mom at 68th National Film Awards Presentation Ceremony!! 😍💞#SuriyaTriumphsAtNationals #SooraraiPottru @Suriya_offl pic.twitter.com/E78WiPQWZo
— Karthik Ravivarma (@Karthlkravivar) September 30, 2022
This is the real “Couple goals” ❤️#Suriya #Jyothika #NationalAwards pic.twitter.com/JPOkObY3ON
— Aasif Ibrahim (@thisis_asf) September 30, 2022
#WATCH | Actor Suriya, who won National Award for Best Actor for ‘Soorarai Pottru’ says, “Huge honour. Truly grateful to National Film Award jury & GoI. Lot of emotions running in my mind. I’ve a lot of people to thank…Getting goosebumps. Truly a moment which I’ll never forget” pic.twitter.com/vOTEN4sqws
— ANI (@ANI) September 30, 2022