సుచిత్రా కృష్ణమూర్తి.. పాపులర్ సింగర్, యాక్ట్రెస్ కమ్ పెయింటర్‌గా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.
సుచిత్రా కృష్ణమూర్తి.. పాపులర్ సింగర్, యాక్ట్రెస్ కమ్ పెయింటర్‌గా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కపూర్‌ని పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన సుచిత్రా.. కొద్ది కాలానికే భర్తతో విడిపోయారు. ‘నా కంటే వయసులో 30 ఏళ్లు పెద్ద, అప్పటికే విడాకులు తీసుకున్న వ్యక్తి అని తెలిసినా అందర్నీ ఎదురించి పెళ్లి చేసుకున్నా. కానీ అతని ప్రేమలో నిజాయితీ లేదు. అందుకే దూరమయ్యాను.. దానికి కారణం హీరోయిన్ ప్రీతి జింటా’.. ఎప్పటికీ ఆమెను క్షమించన’ని షాకింగ్ కామెంట్స్ చేశారామె.
అలాగే సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించారు. తనను ఇబ్బంది పెట్టిన దర్శకుడి పేరు ప్రస్తావించకుండానే అప్పటి సంఘటనకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఆ రోజుల్లో ఆడిషన్స్ ఎక్కువగా హోటల్‌లోనే జరిగేవి. అలా నేనొక డైరెక్టర్‌ను హోటల్‌కి వెళ్లి కలిశాను. అతడు.. నువ్వు మీ అమ్మతో ఎక్కువ చనువుగా ఉంటావా?, మీ నాన్నతో క్లోజ్‌గా ఉంటావా? అని అడిగాడు. నేను మా నాన్నతోనే నాకు చనువు ఎక్కువ అని చెప్పాను. తర్వాత ఆయన చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాను. సరే, మీ నాన్నకి ఫోన్ చేసి, నేను రేపు ఉదయం నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పు అన్నాడు. ఫస్ట్ తనేమంటున్నాడో అర్థం కాలేదు’ అన్నారు.
‘ నాతో ఈ మాట చెప్పినప్పుడు టైం సాయంత్రం 5 గంటలవుతుంది. రేపు ఉదయం వరకు ఈయనతో ఏం చేయాలి? అనుకున్నాను. కానీ అతడి మాటల్లో మీనింగ్ అర్థమై కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఏడుపొచ్చేసింది. వెంటనే నా బ్యాగ్ తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుండి పరుగెత్తుకుని వచ్చేశాను. తర్వాత ఇలా చాలా సార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇంతకన్నా దారుణమైన సంఘటనలను చాలా మంది అనుభవించారు. వారితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్న ఇన్సిడెంట్’ అని చెప్పుకొచ్చారు సుచిత్రా కృష్ణమూర్తి.