సోనూసూద్ ఒకప్పుడు రీల్ విలన్ మాత్రమే. కానీ.., కరోనా కష్టకాలంలో ప్రజలకి సేవ చేస్తూ రియల్ హీరో అయిపోయాడు. వలస కార్మికుల కోసం సొంత ఆస్తుల అమ్మినా.., సహాయం కావాలి అన్న వారికి గంటల వ్యవధిలోనే చేయూత అందించినా, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతున్న సమయంలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినా, ఉపాధి కోల్పయిన వారికి ఓ మార్గం చూపించినా.. అన్నీ సోనూసూద్ కే చెల్లాయి. ఇందుకే ఇప్పుడు సోనూసూద్ అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో.., ఒకప్పుడు సోనూని పొమ్మన్న వారే.., ఇప్పుడు రమ్మంటున్నారు. సోనూసూద్ దీ గ్రేట్ అని కీర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ సినీ మ్యాగజైన్స్లో స్టార్ డస్ట్ ఒకటి. 1971 నుంచి ప్రచురితమవుతుంది. గతంలో స్టార్ డస్ట్ ఆడిషన్స్ కోసం సోనూసూద్ ఫొటోలు పంపితే వారు తిరస్కరించారు. అయితే ఇప్పుడు కొవిడ్ పరిస్థితుల్లో సోనూసూద్ రియల్ హీరోగా మారడంతో వారు కూడా సోనూసూద్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి దిగి వచ్చారు.
సదరు మ్యాగజైన్ సంస్థ తమ కవర్ ఫోటోగా సోనూసూద్ ఫొటోను ముద్రించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న సోనూసూద్, ఫొటోను ముద్రించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ” ఎక్కడైతే నేను ఓడిపోయానో, అక్కడే ఈరోజు గెలిచాను, ఇకపై ఇలానే కష్టపడుతాను. ప్రజలకి ఇలానే దగ్గరగా ఉంటాను. వారి వల్లే నాకు ఇంతటి గౌరవ, మర్యాదలు లభిస్తున్నాయి అంటూ సోనూసూద్ ఎమోషనల్ అయిపోయారు. ఇక త్వరలోనే సోనూసూద్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీకి కూడా మొదలు కాబోతుంది. క్రిష్ డైరెక్షన్ లో ఈ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం సోనూకి పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి సమయంలో కనుక ఈ రియల్ హీరోతో సినిమా చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్నది మేకర్స్ ఆలోచన. ఈ విషయంలో సోనూసూద్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో.., సోనూసూద్ హీరోగా.. ఈ చిత్రం అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకి నిస్వార్ధంగా సేవ చేసినందుకు సోనూసూద్ కి దక్కుతున్న గౌరవ మర్యాదలని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.