Parvathi: తెలుగు బుల్లితెరపై విశేష ప్రేక్షకాదరణ చూరగొంటున్న సింగింగ్ షోలలో ‘సరిగమప – సింగింగ్ సూపర్ స్టార్’ ఒకటి. కొంతకాలంగా ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఈ సింగింగ్ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉండి సపోర్ట్ లేనివారు వెలుగులోకి వచ్చారు. అలా సరిగమప షో ద్వారా పాపులర్ అయినటువంటి నిరుపేద యువతి పార్వతి. ఈ అమ్మాయి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
అందం కంటే మంచి మనసు ముఖ్యమని వచ్చిన కొద్దిరోజులకే తన పెర్ఫార్మన్స్ తో ప్రూవ్ చేసుకుంది పార్వతి. టాలెంట్ షోలో కొంతమంది అందాన్ని గుర్తిస్తే.. ప్రపంచం గుర్తించేది ప్రతిభను మాత్రమే. అలాంటి ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే సాధించగలిగేవి అంత కష్టమేమి కాదని చేసి చూపించింది పార్వతి. ఆ విధంగా సరిగమప కొత్త సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చిన సింగర్ పార్వతి.. అద్భుతమైన పెర్ఫార్మన్స్ లతో దూసుకుపోతుంది.
సింగర్ పార్వతి పాడుతున్న పాటలు అందరిలో ఉల్లాసాన్ని నింపుతున్నాయి. రంగ్ దే సినిమాలోని ఊరంతా వెన్నెల పాటను పార్వతి ఎంతో గొప్పగా పాడింది. ఆరోజే వాళ్ళ ఊరికి బస్సు రప్పించింది. అలా అందరి మనసులు గెలిచిన పార్వతి.. తాజాగా స్టేజిపై తన సోదరుడితో కలిసి ఎమోషనల్ అయిపోయింది. ‘నరుడా ఓ నరుడా’ పాటతో ఆకట్టుకున్న పార్వతి కొత్త ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో మా అక్కను ఎంతోమంది కామెంట్స్ చేశారని ఎమోషనల్ అయ్యాడు పార్వతి సోదరుడు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.