శ్రియా శరణ్.. అందం, అభినయంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇష్టం సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్రనటులతో పాటు యువ హీరోలందరితోనూ నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొంది. ఓ వైపు సినిమాలు చేస్తుండగానే రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చీవ్‌తో ప్రేమలో పడిన శ్రియ 2018లో అతడిని వివాహం చేసుకుంది. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా పుట్టిన కుమార్తెని పరిచయం చేసి.. అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక పెళ్లి తరువాత కూడా శ్రియ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది శ్రియ. తన ఫొటోలతో పాటు భర్తతో దిగిన రొమాంటిక్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వార్త.. ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసింది. తన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోస్ట్ పెట్టి అందరికి షాకిచ్చింది శ్రియ.. హెర్నియాతో బాధపడుతున్న ఆండ్రీకి ఇటీవల అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది శ్రియ.
‘నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. హెర్నియాతో బాధపడుతున్న నా భర్త సుమారు రెండు నెలల పాటు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతను కోలుకున్నాడు. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్ రజనీష్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని పోస్ట్ చేసింది శ్రియ. దీంతో పాటు చేతికి బ్యాండేజీలతో ఉన్న ఆండ్రియో ఫొటోలను జత చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. అభిమానులు కూడా ఏం కాదు.. అంతా బాగానే ఉంటుంది.. ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది శ్రియ నటించిన గమనం.. విమర్శకులు ప్రశంసలు పొందింది. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వస్తోంది. దీంతో పాటు మ్యూజిక్ స్కూల్, దృశ్యం2, తడ్కా (హిందీ), నాగసూరన్, సందకారి (తమిళ్) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రియ. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.