యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం KGF-2. ఎన్నో అంచనాల మధ్య విడుదలై పార్ట్ 2 సరికొత్త రికార్డులను సైతం తిరగరాస్తోంది. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇంటి గెలిచి రచ్చ గెలవాలని చాలా మంది అంటుంటారు. కానీ KGF-2 కలెక్షన్ల పరంగా మాత్రం కర్ణాటకలో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల ముందుకు కలెక్షన్ల పరంగా అన్ని ఏరియాలో ఆశించిన లక్ష్యాన్ని ఢీ కొట్టింది KGF-2.
ఇది కూడా చదవండి: Ram Gopal Varma : KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని వీరప్పన్ తో పోలుస్తూ RGV వ్యాఖ్యలు!
ఇక తెలుగులో రూ.78 కోట్ల టార్గెట్ పెట్టుకోగ రూ.80.90 కోట్లు రాబట్టింది. ఇదే గాక హిందీ+ రెస్టాఫ్ ఇండియా లక్ష్యం రూ.100 పెట్టుకుంటే ఏకంగా రూ.199 కోట్లు కొల్లగొట్టిందట. ఇక అన్ని ఏరియాలో KGF-2 అనుకున్న కలెక్షన్లను రాబట్టినా కర్ణాటకలో మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో బోల్తా కొట్టిందట. ముందుగా ఇక్కడ రూ.100 లక్ష్యాన్ని పెట్టుకోగ రూ.97.75 కోట్లే రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో KGF-2 కలెక్షన్ల పరంగా రచ్చ గెలిచి ఇంట గెలవలేదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో KGF-2 ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోవడానికి ఏదైన కారణం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.