సినిమా, రాజకీయ, క్రీడా రంగంలోని సెలబ్రిటీలకు వృత్తి పరంగా ఎంత క్రేజ్ ఉంటుందో.. వ్యక్తిగత జీవితం పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా సామాన్యుల మాదిరి.. వారు తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లలేరు. హోటల్స్‌కు వెళ్లి నచ్చిన తిండి తినలేరు.. మనలాగా థియేటర్‌కు వెళ్లి ఫెవరేట్ సినిమాలు చూడలేరు. ఇక హీరోయిన్లకు ఈ ఇబ్బందులు మరి కాస్త ఎక్కువ. జనాల్లోకి వెళ్తే చుట్టుముట్టి ఇబ్బంది పెడతారు. అందుకే సామాన్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాలకు చెక్కేసి.. అక్కడ సింపుల్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి వస్తుంటారు. మరి కొందరేమో.. ప్రయోగాలు చేస్తూ.. ఇక్కడే తమకు నచ్చిన జీవితాన్ని గడుపుతారు. తాజాగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. తన అభిమాన హీరో సినిమా చూడ్డం కోసం ఇలాంటి ప్రయోగమే చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలువుతున్నాయి. ఆ వివరాలు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కామెడీ, లవ్, రొమాన్స్, సెంటిమెంట్, కాన్సెప్ట్ ఇలా అన్ని అంశాలు మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్.. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది టాప్ హీరోయిన్లు కూడా ఈ అభిమానులు జాబితాలో ఉన్నారు. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చాలనుకుంటారు. ఇక మహేష్ బాబు అభిమానుల్లో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Sai Pallavi: కమల్ హాసన్ తో సాయిపల్లవి.. కొత్త సినిమా!
ఇక అభిమాన హీరో సినిమా విడుదలయ్యిందంటే.. థియేటర్‌కి వెళ్లి చూడాల్సిందే అని ఫీలవుతారు అభిమానులు. సాయి పల్లవి కూడా అలానే ఫీలయ్యింది. అయితే ఆమె థియేటర్‌కి వెళ్లి సినిమా చూడ్డం అంత ఈజీ కాదుగా. అందుకే.. స్కార్ఫ్, మాస్క్‌తో గెటప్ మార్చి.. ఎవరు తనను చూడకుండా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి వచ్చింది. హైదరాబాద్‌లోని పీవీకే ఆర్కే మాల్లో సర్కారు వారి పాట సినిమా చూడ్డానికి వచ్చింది సాయి పల్లవి. ముఖానికి స్కార్ఫ్ అడ్డుపెట్టుకుని, చేతిలో బ్యాగ్‌తో ఎవరికి అనుమానం రాకుండ థియేటర్‌కి వచ్చి సినిమా చూసింది. ఆ తర్వాత అంతే జాగ్రత్తగా దొంగలా.. కారు దగ్గరకు వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న కెమరాలు మాత్రం సాయి పల్లవిని గుర్తు పట్టి.. ఫోటోలు క్లిక్ మనిపించాయి. అయితే ఇలా దొంగచాటుగా.. ఎవరు గుర్తుపట్టకుండా థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూడ్డం సాయి పల్లవికి అలవాటే. గతంలో భీమ్లా నాయక్ సినిమాను కూడా ఇలానే చూసింది. ఇప్పుడు సర్కారు వారి పాట. ప్రస్తుతం సాయి పల్లవి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
