Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవలే ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో సాయిపల్లవి నెక్ట్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే.. పెర్ఫార్మన్స్ పరంగా ప్రశంసలు వస్తున్నా.. విరాటపర్వం ప్రమోషన్స్‌లో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా ముదురుతూనే ఉంది.
కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని.. అలాగే ఆవులు తరలిస్తున్నారని కొందరు ముస్లింలపై దాడిని కూడా తాను చూడలేకపోయానని చెప్పిన సాయిపల్లవి మాటలపై.. ‘‘కశ్మీరి పండితులపై దాడి.. ఆవులు తీసుకెళ్లే వ్యక్తిపై దాడి నీ ఉద్దేశ్యంలో ఒకటేనా..?’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు నెటిజన్లు. దీంతో సోషల్ మీడియాలో సాయిపల్లవిఅపి విపరీతంగా ట్రోలింగ్ చేశారు.
ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాజాగా సాయి పల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మీరు ఇంటర్వ్యూలోని ఓ క్లిప్ మాత్రమే చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే.. నేనేం మాట్లాడానో మీకే అర్థమవుతుంది. కొన్ని రోజులుగా నాపై వస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై క్లారిటీ ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది.
ఎందుకంటే నా మాటల వల్ల ఎవరూ బాధపడకూడదు. ఒకవేళ నా మాటలతో ఎవరికైనా ఇబ్బంది కలిగిఉంటే క్షమించండి. నాకు హింస అంటే నచ్చదు. ఒక డాక్టర్ గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికీ లేదు. అలాంటివి ఏవైనా నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని అలా ప్రచారం చేశారు. అది సరికాదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకు సపోర్ట్ గా ఉన్నవారందరికీ ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. మరి వివాదంపై స్పందించిన సాయి పల్లవి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
In Kashmir files They showed how Kashmir pandits were killed but during lockdown we saw how Muslims were lynched and people who killed them shouting jai shri ram . Sai pallavi pic.twitter.com/UVuo0kh1hC
— Muzaffar (@El_Mozaffer) June 14, 2022