దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా RRR. అగ్రదర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ ఫిక్షన్ పీరియాడిక్ వార్ డ్రామాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఇక సినిమాలో రామరాజుగా రాంచరణ్, భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అయితే.. మార్చి 25న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. మరో రెండు రోజుల్లో చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ ట్విట్టర్ విశ్లేషకులు అందించిన సమాచారం ప్రకారం.. RRR మూవీ రన్ టైమ్(నిడివి) 3 గంటల 9 నిమిషాల 42 సెకన్లుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే ఫైనల్ కట్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి మూడేళ్లపాటు సమయం కేటాయించిన రాజమౌళి ఎలాంటి అద్భుతాన్ని చూపించనున్నాడో ఫ్యాన్స్ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. మరి ట్రిపుల్ ఆర్ సినిమా పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
#RRRMovie Run Time: 3 Hours 9 Minutes 42 Seconds is Final Cut. 🔥🌊@AlwaysRamCharan @tarak9999 @ssrajamouli #RRRMovieOnMarch25th
— SumanTV (@SumanTvOfficial) March 17, 2022