రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. 2021 ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రానా, సాయి పల్లవి ఇద్దరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌తో సాగే కథ ఇది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాయిదాల పర్వంతో విరాట పర్వంపై చిత్ర బృందంపై అభిమానులు కాస్త గుర్రుగానే ఉన్నారు. సినిమా పలు గాసిప్స్ కూడా షికార్లు చేస్తున్నాయి.
ఇన్ సైడ్ టాక్ అంటూ వార్త రాసిన వారికి రానానే నేరుగా కౌంటర్ ఇచ్చాడు. ‘ఇన్ సైడ్ టాక్.. మ్యూజిక్ డైరెక్టర్ విరాటపర్వం సినిమా నుంచి తప్పుకున్నారు’ అంటూ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ రానా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ రానా కౌంటర్ ఎటాక్ చేశాడు. రానా నుంచి ఈ మాదిరి రిప్లై ఊహించని సదరు వ్యక్తి ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశాడు. ఈ మధ్యకాలంలో గాసిప్స్ పై సెలబ్రిటీలే నేరుగా స్పందించడం ఒకింత షాక్.. మరోవైపు గాసిప్ క్రియేట్ చేయాలి అంటే భయం కూడా వస్తున్నాయి జనాలకు. రానా దగ్గుబాటి రిప్లైపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Yavadu bro neeku chepindhi 😂😂 nee sodhi… https://t.co/ofG6xYGZt5
— Rana Daggubati (@RanaDaggubati) November 2, 2021