ఎనర్జటిక్ స్టార్ రామ్ తాజా చిత్రంపై బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేశ్ బాబు తెరకెక్కించిన ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. అయితే మరో భారీ బడ్జెట్ సినిమా నుంచి పోటీ ఎదురు కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డబుల్ ఇస్మార్ట్ , స్కంద సినిమాలు డిజాస్టర్ అవడంతో రామ్ పోతినేని పూర్తిగా క్లాసికల్ టచ్ సినిమా చేశాడు. అదే ఆంధ్రా కింద్ తాలూకా. కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాను నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఓ స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుుడు ఆకట్టుకుంటోంది. అందరు నటుల ఫ్యాన్స్ హాజరవాలి…మీరెప్పుడైనా మిమ్మల్ని మీరు సినిమాలో చూసుకున్నారా…మీ జీవితాన్ని వెండి తెరపై చూసుకునేందుకు రెడీ అవండి..ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28న విడుదలవుతోంది అంటూ పోస్టర్‌పై రాసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్య శ్రీతో పాటు కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా వివేక్ అండ్ మెర్విన్ తొలిసారిగా సంగీతంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఏడాదిలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్‌లో రవితేజ్ సినిమా మాస్ జాతర విడుదల కానుంది. దాంతోపాటు తేజ సజ్జా సినిమా మిరాయ్, అనుష్క సినిమా ఘాటీ, పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ, రిషభ్ శెట్టి సినిమా కాంతారా వరుసగా రానున్నాయి. ఇక డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఉంది. ఇప్పుడు నవంబర్ 28న రామ్ పోతినేని సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా తేదీ ప్రకటించారు.
రాజాసాబ్‌తో పోటీ ఉంటుందా
అయితే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా విడుదలైన వారం రోజులకే ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ విడుదల కానుంది. ఒకవేళ ఇది వాయిదా పడితే అఖండ్ 2 ఉండవచ్చు. అంటే రాజాసాబ్ లేదా అఖండ 2 ఏదో ఒకటి డిసెంబర్ మొదటి వారంలో ఉంటుంది. అదే జరిగితే రామ్ పోతినేని సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ పోటీ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి.
Dear MEGA,LION,KING,VICTORY, POWER,SUPER,REBEL,TIGER,MEGAPOWER,STYLISH,REAL,RAJINI,KH…fans of all the other Stars.
& My Dearest Fans,Have you ever watched yourself in a movie?
Get Ready to Relive Your Life on the BIG Screen this year! #AndhraKingTaluka on 28-11-25 pic.twitter.com/8Ycscf1vuC
— RAm POthineni (@ramsayz) August 21, 2025