చిత్ర పరిశ్రమలో నటీ, నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు జరగడం సర్వసాధారణమే. అయితే చాలా మంది విషయం బటికి పొక్కినా గానీ తమ మధ్య ఎలాంటి సంబంధంలేదని కొంత మంది సెలబ్రిటీలు చెబుతుంటారు. కానీ మరికొంత మంది మాత్రం మా మధ్య రిలేషన్ ఉందని బాహటంగానే అంగీకరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీలు గత కొన్ని ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన ప్రియుడు అయిన జాకీ పుట్టిన రోజు వేడుకల్లో రచ్చ రచ్చ చేసింది రకుల్. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
రకుల్ ప్రీత్ గత కొంత కాలంగా టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి.. బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రియుడు అయిన జాకీ భగ్నానీ పుట్టిన రోజు వేడుకలు తన నివాసంలో జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటుగా మరికొందరు టాలీవుడ్ తారలు కూడా హాజరుఅయ్యారు. కార్తిక్ ఆర్యన్, కృతిసనన్, షాహిద్ కపూర్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో డ్యాన్స్ లు చేస్తూ.. రచ్చ రచ్చ చేశారు. ప్రియుడితో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..” నా లైఫ్ కు దొరికిన అత్యుత్తమమైన గిఫ్ట్ నువ్వే. హ్యాపీ బర్త్ డే మై లవ్. నా జీవితంలో సంతోషాన్ని, శాంతిని నింపుతున్నందుకు నీకు నా ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది.
ఈ కామెంట్ పై స్పందించిన జాకీ..”టోటల్ వరల్డ్ లో నన్ను ఎప్పుడూ సంతోషపెట్టే వ్యక్తివి నువ్వే” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ చిత్రాలకు బ్రేక్ ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. బిజీబిజీగా సినిమాల్లో నటిస్తోంది. ఇక ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట.. రెండు సంవత్సరాల క్రితమే తమ ప్రేమను ప్రపంచానికి వెళ్లడించింది. ఇక ఈ పార్టీకి సంబంధించిన మరికొన్ని పిక్స్ ను మంచు లక్ష్మి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.