Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులు తిరగరాసింది. విడుదలైన అన్నిచోట్ల భారీ వసూలు సాధించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇతర భాషల్లో ఆకట్టుకున్న చిత్రంగా ‘పుష్ప’ నిలిచింది. సుకుమార్ డైరెక్షన్, బన్నీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ప్రస్తుతం ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పుష్పకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పుష్ప 2ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు దర్శకుడు సుకుమార్. మొదటి భాగాన్ని మించిన ఎలివేషన్స్‌తో రెండవ భాగాన్ని తీయాలన్న గట్టి నిర్ణయంతో ఉన్నారు. స్టార్ క్యాస్ట్‌ను కూడా రంగంలోకి దించుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చి చేరింది.
పుష్ప 2లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నాడన్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతిగా జంటగా ప్రియమణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కాబట్టే ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ ఆమెను ఎలాంటి పాత్రలో చూపెడతారో వేచి చూడాల్సిందే. మరి, పుష్ప 2లో విజయ్ సేతుపతికి జంటగా ప్రియమణి నటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అందరి ముందు బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జంట లిప్‌లాక్!