దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రియమణి పాపులర్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో భావోద్వేగానికి గురైంది. ఆమె వెండితెరపై హీరోయిన్ గా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. అదేవిధంగా బుల్లితెరపై ఢీ షో జడ్జిగా కూడా అంతే ఆకట్టుకుంటోంది. అయితే.. ఢీ షోలో జడ్జిగా ప్రియమణి అడుగుపెట్టి 5 ఏళ్ళు పూర్తవడంతో.. ఆమె లైఫ్ స్టోరీని ఓ పెర్ఫార్మన్స్ రూపంలో ప్రెజెంట్ చేశారు సాయి – నైనిక.
ప్రియమణి సినిమాల్లోకి రాకముందు పడిన కష్టాలు మొదలుకొని.. ఆమె సినీఎంట్రీ, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విధానం, లవ్ – మ్యారేజ్.. ఇలా అన్ని విషయాలను టచ్ చేస్తూ స్టేజిపై ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ప్రెజెంట్ చేశారు. అయితే.. ఈ మొత్తం పెర్ఫార్మెన్స్ లో ప్రియమణి ప్రేమ వివాహం జరిగిన తీరు హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో జడ్జి సీట్లో కూర్చున్న ప్రియమణి తన భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.
పెర్ఫార్మన్స్ అనంతరం ప్రియమణికి తన అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటోను గిఫ్ట్ గా ఇచ్చాడు కొరియోగ్రాఫర్ సాయి. తన అమ్మమ్మతో కలిసున్న ఆ పెయింటింగ్ ని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ప్రియమణికి తన అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో ఇదివరకు కొన్నిసార్లు చెప్పింది. నిజానికి ప్రియమణి నటిగా ఇంతటి గొప్ప స్థాయికి రావడానికి, నేషనల్ అవార్డు అందుకోవడానికి ప్రధాన కారణం తన అమ్మమ్మ అని చెబుతూ ఏడ్చేసింది. అమ్మమ్మ సహకారం లేకపోతే ఈరోజు తాను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదని ప్రియమణి స్టేజిపైనే కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ప్రియమణి ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.