పూనమ్ కౌర్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్ గా వెండితెరపై వెలిగినా.. ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లి కాస్త డీలా పడిన మాట వాస్తవమే. కానీ, పూనప్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఒక్కోసారి అవి టాక్ ఆఫ్ ది టౌన్ గా కూడా మారుతుంటాయి.
తాజాగా పూనమ్ కౌర్ తన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ ఒకటి షేర్ చేసింది. ఆ చాటింగ్ ఒక సినిమాకు సంబంధించిన రివ్యూ. అందులో ఇద్దరి చాట్ ఇలా సాగింది “ ఉదయాన్నే బావ సినిమాకి వచ్చాను.. అని మెసేజ్ పెట్టగా.. దానికి అవతల వ్యక్తి జెన్యూన్ రివ్యూ కావాలని కోరారు. దానికి సమాధానంగా.. సినిమా హిట్ ప్రామిస్ అంటూ రిప్లై వచ్చింది”. ఈ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఎవరిది? ఆ బావ ఎవరు? అనే దానిపై తమకు నచ్చిన పేర్లు పెట్టుకుని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.
❤️ pic.twitter.com/VapEBmIh5f
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 25, 2022