సినిమా హీరోలుకు అభిమానులుంటారు, వీరాభిమానులుంటరు. కానీ ఓ హీరోను దేవుడిగా కొలిచే అభిమానులను సంపాదించుకున్న ఘనత కేవలం నందమూరి తారకరామారావుకే సాధ్యం అయ్యింది. తెలుగు వారికి రాముడు, కృష్ణుడు, శివుడు అంటే ఎన్టీఆరే. ఆ పాత్రల్లో ఆయనను తప్ప వెరేవరని ఊహించుకోలేరు. ఇక తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన తెలుగు వెలుగు .. ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి సాధారణ మనుషులే కాదు.. ఎందరికో మార్గదర్శకులుగా నిలిచిన కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పరమాచార్య సైతం పరవశమయ్యారు. 1978లో ఎన్టీఆర్‌కు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదుని ప్రదానం చేశారు జగద్గురు. తెలుగు సినిమాకే మూల స్తంభంగా నిలిచిన నందమూరి నాయకుడి శత జయంతి నేడు (మే 28). ఈ సందర్భంగా ఆయన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
కృష్ణుడంటే మీరే గుర్తుకు వస్తారు: సర్వేపల్లి రాధకృష్ణకృష్ణుడి పాత్ర అంటే మనసులో మెదిలేది ఎన్టీఆర్ రూపమే. కానీ ‘ఇద్దరు పెళ్లాలు’ సినిమాలోని ఓ పాటలో ఆయన తొలిసారి కృష్ణుడి పాత్ర వేస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ‘సొంత ఊరు’ చిత్రంలో కృష్ణుడిగా కనిపిస్తే థియేటర్లో నానా అల్లరి చేశారు. అందుకే ఆయన ‘మాయబజార్లో లో శ్రీకృష్ణుడి పాత్ర ధరించడానికి తొలుత ధైర్యం చేయలేకపోయారు. తర్వాత ఆయన పౌరాణిక పాత్రల్లోని ఔచిత్యాన్ని అర్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్లు తనను తాను మలచుకున్నారు. వెండితెరపై రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా నిజంగా ఆయా దేవుళ్లే దిగివచ్చినట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Balakrishna: అంగరంగ వైభవంగా NTR శతజయంతి ఉత్సవాలు.. వైరలవుతోన్న బాలయ్య వీడియో!
ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో మాయాబజార్ ఒక అద్భుతం. కృష్ణుడి పాత్ర కోసం వ్యాయామం మానేశారు. యోగ, ప్రాణాయామం చేశారు. ‘మాయాబజార్ చిత్రీకరణ సమయంలో శ్రీ కృష్ణుడి వేషం వేసుకొని మెల్లగా స్టూడియోలోని ఫ్లోర్కు నడుచుకుంటూ వచ్చారు. దేవుడే వచ్చినట్లనిపించి చాలా మంది ఆయనకు పాదాభివందనం చేశారంటే ఆయన పాత్రకు ఎంతలా ప్రాణం పోశారో అర్ధమవుతుంది. ‘నేను భగవద్గీత. చదువుతున్నప్పుడల్లా నీ స్వరూపమే కృష్ణుడిగా నాకు కనిపిస్తుంది’ అని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి ఎన్టీఆర్ అన్నారట. అదీ ఎన్టీఆర్ అభినయమంటే.
టికెట్ ధర పావల.. కోటి సాధించిన చిత్రంప్రస్తుతం ఓ సినిమా భారీ కలెక్షన్లు సాధించాలంటే.. ఎడాపెడా టికెట్ రేట్లు పెంచుకోవ్సాలిందే. నార్మల్ టికెట్ ధరలతో ఓ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ప్రస్తుత కాలంలో అయితే సాధ్యం కాదనే చెప్పవచ్చు. కానీ ఎన్టీఆర్ రాముడిగా నటించిన ‘లవకుశ’ సినిమా అప్పట్లో కనీవినీ ఎరుగని విజయం సాధించింది. ఆ రోజుల్లో టికెట్ ధరలు.. నేల 4 అణాలు (25 పైసలు), బెంచి 8 అణాలు (50 పైసలు), బాల్కనీ ఒక రూపాయి ఉండేవి. ఆ ధరలతోనే ‘లవకుశ’ సినిమా దిగ్విజయంగా ప్రదర్శితమై రూ. కోటి వసూళ్లను రాబట్టింది. ఓ తెలుగు సినిమా రూ. కోటి వసూలు చేయడం అదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం.. స్వయంగా ప్రకటించిన నాగార్జున!
నేడు ఆ మహానీయుడి శతజయంతి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎంతో సంతోషంగా ఈ వేడుకలు చేసుకుంటున్నారు. దీని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna: అఖండ సినిమాతో నెం.1 హీరోగా రికార్డు సృష్టించిన బాలయ్య..!