మెగా కాంపౌండ్‌నుంచి హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ మెగా గాళ్.. నిహారిక. యాంకర్‌గా తన ప్రస్ధానాన్ని మొదలుపెట్టారు నిహారిక. బుల్లి తెరపై యాంకర్‌గా పలు షోలు చేశారు. యాంకర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత హీరోయిన్‌గా కూడా మారారు. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు యాంకరింగ్ చేశారు. అంతేకాదు! ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు వెబ్ సిరీస్‌లను కూడా తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమాల్లో నటనకు బ్రేక్ ఇచ్చారు.
కేవలం ప్రొడక్షన్ మీదే దృష్టిసారించారు. ఇక, నిహారిక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, ఆమె నటుడు బ్రహ్మానందంతో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ‘‘ బ్రహ్మానందం గారితో మంచి సంభాషణ జరిపాను. ఆయనలో చాలా హాస్యస్పురణ ఉంది. అంతేకాదు! ఎంతో జ్ఞానం కలిగిన మనిషి. ఓ మంచి కధకుడు. నేటి ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆయనతో ఉన్న ప్రతీ నిమిషం చాలా బాగుండింది. థాంక్యూ అంకుల్.. మీరు చేసిన పనుల గురించి నాకు చెప్పినందుకు థాంక్స్.
ఇలాంటి మీటింగ్‌లు భవిష్యత్తులో చాలా ఉంటాయి. నేను ఓ కొత్త స్నేహితుడ్ని పొందానా?.. రంగమార్తండ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు. కాగా, నిహారిక తెలుగులోనే కాదు తమిళంలోనూ ఓ సినిమా చేశారు. ‘ ఒరు నల్ల నాల్ పాతు సెల్రేన్’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా చేశారు. ఈ సినిమా తర్వాతి ఇద్దరూ కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో నిహారిక, విజయ్ సేతుపతిది గెస్ట్ రోల్ కావటం విశేషం.