కొణిదెల నిహారిక.. మెగా డాటర్ గానే కాకుండా ఒక నటిగానూ తానేంటో నిరూపించుకుంది. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా కూడా విజయం దక్కించుకుంది. ఇవన్నీ పక్కన పెడితే ఏదొక విషయంలో ఆమె పేరును వైరల్ చేస్తున్నారు. గాసిప్స్ కానివ్వడం, లేనిపోనివి రాయడంతో కానివ్వండి ఎప్పుడూ నిహారిక పేరును సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. అలాంటి గాసిప్స్, పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో నిహారిక తల్లి స్పందించారు. స్పందించడమే కాకుండా అలాంటి వార్తలు ప్రచారాలు చేసే వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: ప్లీజ్ దయచేసి.. ఆ పోస్టుల్ని వెంటనే డిలీట్ చేయండి: విశ్వక్ సేన్
విషయం ఏంటంటే.. మదర్స్ డే సందర్భంగా నిహారిక ఆమె తల్లితో కలిసి ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో హోస్ట్ నిహారికను ఓ ప్రశ్న అడిగారు. మీ మీద పెళ్లి, డైవర్స్ అని గాసిప్స్ వస్తున్నాయి కాదా.. వాటిపై మీరు ఎలా స్పందిస్తారు అని కోరగా.. అందుకు నిహారిక తల్లి స్పందించారు. అలాంటి పుకార్లు ప్రచారాలు చేసే వారిని పట్టించుకోకూడదంటూ తెలిపారు. అలా పుట్టుకొచ్చే వార్తలను పట్టించుకుంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేమంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా అలాంటివి వైరల్ చేసే వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘మా బావ గారు చిరంజీవి గారు ఉన్నంత కాలం మా కుటుంబాన్ని ఎవరూ ఏం చేయలేరు’ అంటూ తెలియజేశారు. నిహారిక తల్లి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.