తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో ‘ఢీ‘ ఒకటి. గత 13 సీజన్ల నుండి విశేషాదరణ పొందిన ఈ డాన్స్ ప్రోగ్రామ్.. ప్రస్తుతం ‘డ్యాన్సింగ్ ఐకాన్‘ పేరుతో 14వ సీజన్ కొనసాగుతుంది. అయితే.. ఇదివరకు ఢీ షోలో ఎంటర్టైన్ మెంట్ కోసం సుధీర్, రష్మీ జంట ఉండేది. కానీ 14వ సీజన్ లో వారిద్దరూ లేకపోయేసరికి హైపర్ ఆది తప్ప అంతా కొత్తవాళ్లే కనిపిస్తున్నారు.
తాజాగా ఢీ షో నుండి కొత్తగా ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో జానీ మాస్టర్, ప్రియమణి, నందిత జడ్జిలుగా కనిపిస్తున్నారు. అయితే.. ఈసారి చాలా సందడిగా సాగిన ఈ ప్రోమోలో సీరియల్ కపుల్ నవ్యస్వామి. రవికృష్ణ హైలైట్ అవుతున్నారు. ప్రోమోలో నవ్య, రవికృష్ణ కలిసి ఓ రొమాంటిక్ పెర్ఫార్మన్స్ చేశారు. రొమాంటిక్ సాంగ్ కాబట్టి ఎన్నడూ లేనివిధంగా నవ్య, రవి రెచ్చిపోయి పర్ఫామ్ చేయడం గమనార్హం.ఇక నవ్య, రవి పెర్ఫార్మన్స్ టైంలో హైపర్ ఆది, ప్రియమణిల ఎక్సప్రెషన్స్ వైరల్ అవుతున్నాయి. ఆ రొమాంటిక్ సాంగ్ కి ఆది ఇచ్చిన ఎక్సప్రెషన్ చూస్తే.. ప్రియమణిని డాన్స్ చేసేందుకు పిలిచాడని అంటున్నారు నెటిజన్లు. ఇక తాజా ప్రోమో చూస్తే.. ఢీలో కూడా కంటెంట్ పక్కనపెట్టి మసాలా పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
#Dhee pic.twitter.com/MAJR4h1qY2
— K I N G (@KingPaONEkalyan) February 17, 2022
సాధారణంగా సీరియల్ జంట అయినప్పటికీ నవ్య, రవిల మధ్య లవ్, డేటింగ్ లాంటివి నడుస్తున్నాయని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజా ఢీ ప్రోమో చూసేసరికి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్.. నిజంగానే ఉందని, అందుకే ఆ స్థాయిలో పర్ఫర్మ్ చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి నవ్య – రవిల రొమాంటిక్ పెర్ఫార్మన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.