Naresh: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ మధ్య రిలేషన్ షిప్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు పవిత్రతో నాలుగో పెళ్లికి రెడీ అయ్యారని మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి నరేష్ – పవిత్ర లపై పలు ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో కన్నడ మీడియాతో మాట్లాడారు నరేష్. ”నేను కూడా మనిషినే. నాకు ఓ ఎమోషనల్ సపోర్టు కావాలి. నేను ఓ మూవీ సమయంలో పవిత్రా లోకేష్ ను కలిశాను. మేము ఫ్రెండ్స్ మాత్రమే. పరస్పరం మా కష్టసుఖాలు మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అయింది.. అలాగే నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. అందరూ అంటున్నట్లుగా ఆమె నా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నింటిలో ఉంటుంది. ‘రమ్యా.. ఫ్యామిలీ ఫంక్షన్లలో నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు? అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు” అని నరేష్ అన్నారు.
ఈ క్రమంలో రమ్య తనకు భార్యలా ఎప్పుడూ ప్రవర్తించలేదని.. బాబు పుట్టిన ఏడాది తర్వాత తన క్యారక్టర్ బయటపడిందని.. ఆ విషయాలు చెబితే మహిళలందరూ బాధ పడతారని అన్నారు. ఆమె దగ్గర ఒక హ్యాండ్సమ్ ముస్లిం డ్రైవర్ పని చేస్తాడని.. అతనితో ఎఫైర్ పెట్టుకుందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ముగ్గురు మహిళలు కలిసి ఊటీ గెస్ట్ హౌస్ కు వెళ్లారని.. అక్కడ కొన్ని బ్యాడ్ సంఘటనలు జరిగాయని.. తన స్టాఫ్ ద్వారా ఈ విషయం తెలిసిందని.. అవి ప్రెస్ ముందు చెప్పలేనన్నారు.
ఇదేంటని ప్రశ్నిస్తే అబద్ధపు వివరణలు ఇచ్చి, అలా తనని వేధించిందని.. ఇవన్నీ ఎంతో బాధించాయని నరేష్ చెప్పడం గమనార్హం. ఒకసారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆమె ఫుల్ గా తాగి మేల్ క్యాబరే డ్యాన్సర్ ని తీసుకొచ్చిందని.. తాను ఒక యాక్టర్ గా అందరికీ తెలుసని.. ఇప్పటివరకూ తనపై సెక్స్చ్యువల్ హరాష్మెంట్ ఆరోపణ కూడా ఉండదన్నారు. తన లైఫ్ తనకు కావాలని.. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నరేష్ చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇక ఓవైపు నరేష్ మూడో భార్య రమ్య, మరోవైపు పవిత్ర లోకేష్ ఆరోపణలు, మాటలు సైతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.