సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్లలో లేదా ఏదొక ఇంటర్వ్యూలో తమ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ లను షేర్ చేస్తుంటారు. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెరీర్, పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు క్రేజీ విషయాలు చెబుతూ వచ్చాడు చైతూ.
ఇక నేషనల్ మీడియా అయితే ఎక్కువగా నాగచైతన్య పర్సనల్ విషయాల మీదే శ్రద్ద పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. సినిమా విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ లో జరిగిన ఫన్నీ, రొమాంటిక్ సంఘటనలను కూడా అడిగింది. అందుకు చైతూ ఓసారి తన గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తుండగా.. దొరికిపోయానని చెప్పాడట. ప్రస్తుతం సినీవర్గాలలో చైతూ టాపిక్ వైరల్ అవుతోంది. మరి ఆ సంఘటన ఏంటో వివరాల్లోకి వెళ్తే..
లాల్ సింగ్ చడ్డా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. నాగచైతన్య తన లైఫ్ లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని గుర్తుచేసుకున్నాడు. తాను కారులో తన గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు పెడుతుండగా పోలీసులకు దొరికిపోయానని.. అదేమీ తనకు తప్పుగా అనిపించలేదని చెప్పాడట చైతూ. అంతేగాక.. తాను చేస్తుంది ఏంటో తనకు బాగా తెలుసని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్నీ బయట పెట్టినప్పటి నుండి ఆ అమ్మాయి ఎవరా? అని ఆలోచిస్తుంటారంటూ నవ్వేశాడు. మరి చైతూ లైఫ్ లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.