బాలీవుడ్ లో అడుగుపెడుతున్న టాలీవుడ్ హీరోల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో రానా, బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్, లైగర్ తప్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’తో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో చైతూ కీలకపాత్ర పోషించాడు. అయితే.. ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నాడు.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విషయాలతో పాటు చైతూకి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని ప్రశ్నలకు ఓపికగానే సమాధానం చెబుతున్నాడు.. మరీ పర్సనల్ గా వెళ్తే సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకి తన టాటూకి సంబంధించి ప్రశ్నతో పాటు ఇప్పుడు సమంత ఎదురైతే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు చైతూ క్రేజీ ఆన్సర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సమంత కనిపిస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ.. “హాయ్ చెప్పి హగ్ ఇస్తా” అని చెప్పాడు. చైతూ చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం తన రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటనే ప్రశ్న అడగ్గానే నవ్వేసి.. హ్యాపీ అని చెప్పేశాడు. ఇదిలా ఉండగా.. చైతూ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతూ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి చైతూ టాటూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.