టాలీవుడ్ హీరోలంతా మెల్లగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. గతంలో రానా, బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్, లైగర్ తప్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో చైతూ కీలకపాత్ర పోషించాడు. అయితే.. ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నాడు.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విషయాలతో పాటు చైతూకి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని ప్రశ్నలకు ఓపికగానే సమాధానం చెబుతున్నాడు.. మరీ పర్సనల్ గా వెళ్తే సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకి తన టాటూకి సంబంధించి ప్రశ్న ఎదురైంది. మీ చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏంటని అడగగా.. ‘అది తన మ్యారేజ్ డేట్’ అని చెప్పాడు చైతూ.
అదేవిధంగా తన ఫ్యాన్స్ టాటూ వేయించుకోవడం గురించి కూడా మాట్లాడాడు. తన ఫ్యాన్స్ కూడా తనలాంటి టాటూస్ వేయించుకుంటారని, తాను అలా టాటూస్ వేయించుకోవద్దని చెబుతానని అన్నాడు. ఎందుకంటే.. టాటూస్ పర్మినెంట్ గా ఉంటాయి.. కానీ వాటి అర్థాలు మారిపోతుంటాయి. అందుకే వద్దని చెబుతుంటానని అన్నాడు. మరి మీ టాటూ సంగతేంటీ? అని అడగ్గా.. “నాకు పర్వాలేదు.. కానీ ఈ టైప్ టాటూస్ ఫ్యాన్స్ వేయించుకోవడం ఇష్టం లేదు” అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే.. చైతూ గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతూ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి చైతూ టాటూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.