తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీనియర్ నటీమణులలో ముచ్చర్ల అరుణ ఒకరు. పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుణ.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టి, హైదరాబాద్ లో చదువు పూర్తిచేసింది. ఇక మ్యూజిక్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటున్న సమయంలో లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఆమెకు ‘సీతాకోకచిలుక’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా పదహారేళ్లకే డెబ్యూ చేసి సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత.. హీరోయిన్ గా వెనక్కి చూసుకోకుండా హిట్ సినిమాలు చేసింది.
కెరీర్ లో తెలుగులో 36, తమిళంలో 24, మలయాళంలో 14, కన్నడలో 3 సినిమాలు చేసింది. 1990లో వ్యాపారవేత్త మోహన్ గుప్తాను ప్రేమించి పెళ్ళాడి.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అరుణ – మోహన్ దంపతులకు నలుగురు కూతుళ్లు. నలుగురూ వాళ్ళ వాళ్ళ కెరీర్స్ పరంగా సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ముచ్చర్ల అరుణ విశ్రాంత నటిగా.. నలుగురు కూతుళ్ళ తల్లిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. తాజాగా సుమన్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో అరుణ.. కూతుళ్లు పుట్టినప్పుడు ఆమె ఫ్యామిలీ నుండి, సొసైటీ నుండి ఫేస్ చేసిన పరిస్థితులను షేర్ చేసుకున్నారు.
ఎవరికైనా నలుగురు కూతుళ్లు పుట్టారంటే.. వాళ్ళకి తోడుగా ఒక్క కొడుకైనా పుట్టాల్సిందనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ విషయంలో దేవుడి దయ అనుకోవడం తప్ప ఎవరూ ఏమి చేయలేరు. అయితే.. కూతుళ్లు పుట్టినప్పుడు అందరి ఇళ్లల్లో జరిగినట్లే మా ఇంట్లోనూ జరిగాయంటోంది అరుణ. ఆమె మాట్లాడుతూ.. “మొదటి కూతురు పుట్టినప్పుడు మా అత్తగారు, అమ్మగారు చాలా ఫీలయ్యారు. నా భర్త, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అలా నలుగురు పుట్టేసరికి మా అమ్మగారు, అత్తగారు ఏడుస్తున్నారు. నాకర్థం కాలేదు. వాళ్లేందుకు ఏడుస్తున్నారో. కొడుకు లేకపోతే ఏమవుతుందని చెప్పా” అంటూ ఆరోజుల్లో జరిగిన విషయాలు షేర్ చేసుకున్నారు. మరి ప్రస్తుతం ముచ్చర్ల అరుణ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.